
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు 15వ పెళ్లి రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్ లో నమ్రతాతో దిగిన మధురమైన ఫోటోను "హ్యాపీ 15 లవ్, రోజు రోజుకు నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్న" అని మెసేజ్ తో షేర్ చేసాడు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 2000 సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వం వహించిన "వంశీ' షూటింగ్ లో కలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల ఫ్రెండ్ షిప్ తరువాత, ఇద్దరు 2005, ఫిబ్రవరి 10న ముడుముళ్లతో ఒకటయ్యారు. ఈ జంటకు గౌతమ్ కృష్ణ మరియు సీతారా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నమ్రతా శిరోద్కర్, మాజీ మోడల్ మరియు నటి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నమ్రతాకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు నమ్రతా1993లో మిస్ ఇండియా టైటిల్ ను గెలుచుకుంది. ఇక మహేష్ తో వివాహం తర్వాత నటనకు దూరంగా ఉంది. నమ్రతా చివరిసారిగా 2004లో వచ్చిన 'బ్రైడ్ అండ్ ప్రిజూడీస్' సినిమాలో కనిపించింది.