
దర్శకుడు మారుతి....హీరోలకు భిన్నమైన జబ్బులను పెట్టి వాటితో హాస్యం పడిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ లు కొడుతూ వెళ్తున్నాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ తో 'ప్రతిరోజూ పండగే' సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మహేష్ తనకు అవకాశం ఇచ్చినా నేను సినిమా చేయలేదని సంచలన విషయాలను వెల్లడించారు. మారుతి మాట్లాడుతూ...'సుధీర్ బాబు హీరోగా నేను చేసిన 'ప్రేమ కథా చిత్రం' మహేష్ బాబు చూసి అభినందించారు. కొన్నిరోజులకి నాకు అడ్వాన్స్ గా చెక్ ఇచ్చి తన కోసం కథను సిద్ధం చేయమని చెప్పారు. నేను చెక్ తీసుకొని కూడా సినిమా చేయలేకపోయాను. దానికి కారణం, మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా మాములు విషయం కాదు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని నేను అందుకోగలనా? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అల్లు అర్జున్ కూడా కొత్త జంట సినిమా చేస్తున్న సమయంలో తన కోసం కధ సిద్ధం చేయమని అడిగారు. అప్పటికి నాకు స్టార్ హీరోను డైరెక్ట్ చేయలేనేమోనని వదులుకున్న' అని తెలిపారు.