
మహేష్ హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన "మహర్షి" మంచి విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ గా నిలవడంతో అదే జోష్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో నటిస్తున్నాడు. మొదటిసారిగా ఈ చిత్రంలో మేజర్ అజయ్ గా కనిపించనున్నాడు. అంతేకాదు ప్రముఖ సీనియర్ నటి విజయ్ శాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా ప్రతి సోమవారం సినిమా పాటలను రిలీజ్ చేస్తున్న యూనిట్ నిన్న "హి ఈజ్ సో క్యూట్" అనే మరో పాటను రిలీజ్ చేసింది. ఈ పాట చూసిన వారికి వెంటనే విజయ్ దేవరకొండ గీత గోవిందం లోని "ఏంటే ఏంటే ఓసి మనసా" పాట గుర్తొస్తుంది. దానికి కారణం మ్యూజిక్, ట్యూన్ కాదు..రెండు పాటల్లో హీరోయిన్ హీరోను టీజ్ చేస్తున్నట్లుగా, ప్రేమిస్తున్నట్లుగా ఉండటమే. అంతేకాదు రెండు పాటల్లో హీరోయిన్ రష్మీక అవ్వటంతో హి ఈజ్ క్యూట్ పాట విన్నవారికి వెంటనే గీత గోవిందం పాట గుర్తొస్తుంది.