
బన్నీ కోసం వెనక్కి తగ్గిన మహేష్ ?
అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అల..వైకుంటాపురములో" చిత్రంతో వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు ఏడాదికి పైగా బన్నీ తెరపై కనిపించలేదు. దీంతో ఈ సినిమా మీద మామూలుగానే ఆసక్తి నెలకుంది. ఇక సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె, మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కానుంది. మహేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతలా వెయిట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకేరోజు ఇద్దరు టాప్ హీరోలు బరిలోకి దిగడం బయ్యర్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. జనవరి 12ని మొదట మహేష్ లాక్ చేసినప్పటికీ బన్నీ కూడా అదే రోజు కావలనడంతో తప్పలేదు. అయితే చివరికి ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు.. నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరింది. అల్లు అరవింద్, దిల్ రాజు కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు ఒక రోజు ముందు అంటే జనవరి 11న రానున్నాడు. బన్నీ యధావిధిగా జనవరి 12న రానున్నాడు. దీంతో బయ్యర్లు కాస్త కుదుటపడ్డారు.