
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లితో జతకట్టనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు, చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందిన సమాచారం నిజమైతే, మహేష్ బాబును ద్విపాత్రలో చూసే మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రంలో మహేష్ బాబు గ్యాంగ్ స్టర్ గా, లెక్చరర్ గా కనిపిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం బాషా తరహాలో ఉండబోతుందని చెబుతున్నారు. అయితే, మహేష్ బాబు ద్విపాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా పేరు పెట్టిన ఈ సినిమా ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు. ఏప్రిల్ నుండి రెగులర్ షూటింగ్ మొదలు కానుంది.