
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడంటే సోషల్ మీడియాలో కొంతమేర యాక్టివ్ ఉంటున్నారు కానీ ఇదివరకు మహేష్ ఎక్కడున్నాడో, ఎం చేస్తున్నాడో ఏమి తెలిసేది కాదు. ఈ మార్పుకు కారణం మహేష్ భార్య నమ్రత శిరోద్కర్. ఆమె సోషల్ మీడియాలో నిత్యం కుటుంబానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అలానే మహేష్ బాబును కూడా మార్చేశారు. ఇక నేడు ఈ జంట పెళ్లి రోజు సందర్బంగా మహేష్ బాబు భార్య నమ్రతకు ముద్దు పెడుతున్న ఫోటో పెట్టి '16 ఏళ్ల ప్రయాణం. మరిన్ని మధురమైన క్షణాలు నీతో గడిపేందుకు ఎదురుచూస్తున్నా' అని పోస్ట్ పెట్టాడు. మహేష్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నేటింట హల్ చల్ చేస్తుంది. అయితే 1999 లో రాజకుమారుడుతో హీరోగా అరంగేట్రం చేసిన మహేష్ మూడు సినిమా వంశీ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకొని గౌతమ్, సితార అనే పిల్లలకు గొప్ప తల్లితండ్రులుగా మారి ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.