
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ప్రత్యేకం. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా ఇప్పటికి చాలా మంది అమ్మాయిలకు మాత్రం ఆల్ టైం ఫెవరేట్, హార్ట్ త్రోబ్ మహేష్ బాబే. అయితే తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో సినిమా చేయటం మహేష్ కు కొత్తేమి కాదు. కానీ అన్ని సార్లు అది కలిసి రాలేదు. అయినప్పటికీ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మహర్షిలో మహేష్ పాత్రకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. మహేష్ కెరియర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాల్లో మహర్షి ఒకటి. అయితే అలాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మహేష్ మరో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వంశీ వెల్లడించారు. తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించాడు. మరి ఆ సినిమా మహర్షి రేంజ్ లో అడుతుందో లేదో చూడాలి.