
మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని వారాలుగా ప్రతి సోమవారం సినిమాకు సంబంధించిన ఏదోక అప్డేట్ ఇస్తూ వచ్చిన టీం గత వారం హి ఈజ్ సో క్యూట్ అనే పాటను రిలీజ్ చేసింది. అయితే ఈ పాటకు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని వేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాటలో రష్మీక వేసే స్టెప్పులనే అచ్చుగుద్దినట్టు సితార దించేసింది. దానికి తోడు సితార క్యూట్ ఎక్స్ప్రెషన్స్ వీడియో వైరల్ అవ్వడానికి కారణమైంది. మహేష్ కూతురు సితార ఇలా చేయటం తొలిసారి ఏంకాదు. తండ్రి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆ సినిమాలోని ఫెమస్ పాటలకు సితార డాన్స్ చేస్తుంటుంది. తెలిసో తెలియకో ఇది సినిమాకు ప్రమోషన్ లాగా ఉపయోగపడుతుంది.