
బిగ్ బాస్ ద్వారా ప్రజలకు బాగా పరిచయమైన సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఆ షో నుంచి వచ్చిన మొదలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. పవన్ ఫ్యాన్స్ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిన ఉరుకోలేదు కానీ కొన్ని రోజులకు మెత్తబడ్డాడు. ఇప్పుడు మరోసారి పవన్ పై విమర్శల దాడి చేసాడు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ అధికార పార్టీ అయిన వైసీపీను టార్గెట్ చేస్తూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరిగిన దిశ రేప్ కు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్షమే కారణమని పవన్ ప్రస్తావించడం జరిగింది. దిశ రేప్ కు మాతృభాషకు లింక్ ఎలా పెట్టావయ్యా అంటూ కత్తి మహేష్ సోషల్ మీడియాలో ఏకిపారేశారు. వామ్మో. వాయ్యో.. ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో అంటూ ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చాడు కత్తి మహేష్. జగన్ ను విమర్శించే క్రమంలో నువ్వు ఏ సోది మాట్లాడినా వింటారనుకుంటున్నవా అని విమర్శించారు.