
మహేష్, ఎన్టీఆర్ తర్వాతే ప్రభాస్..?
ఈమధ్య కొత్త దర్శకులు ఇండస్ట్రీకు వచ్చి ప్రతిభతో దుమ్మురేపుతున్నారు. కేవలం ఒక్క సినిమా అనుభవంతోనే భారీ బడ్జెట్ సినిమాలను అగ్ర హీరోలతో తెరెక్కించే అవకాశం దక్కించుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తాడు దర్శకుడు ప్రశాంత్ నిల్. కన్నడలో ప్రశాంత్ నిల్ యశ్ హీరోగా తెరకెక్కించిన కెజిఎఫ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో వేరే చెప్పాల్సిన పని లేదు. కన్నడలోనే కాక సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసింది ఆ చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇకపోతే ప్రస్తుతం కెజిఎఫ్ పార్ట్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నిల్ తెలుగులో ఇప్పటికే మహేష్ మరియు ఎన్టీఆర్ తో సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. కెజిఎఫ్ సాధించిన విజయం చూసి బడా హీరోలు ప్రశాంత్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే తెలుగులో మహేష్, ఎన్టీఆర్ లకు వారి వారి కధల లైన్స్ చెప్పి ఒప్పించిన ప్రశాంత్ ....తాజాగా ప్రభాస్ కు కూడా ఒక లైన్ చెప్పడం దానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాటం జరిగిందట. కానీ మొదట మహేష్ తో సినిమా పూర్తి చేసి..ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసి అప్పుడు ప్రభాస్ సినిమా చేస్తాడట.