
టాలీవుడ్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. అసలు విషయానికి వస్తే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహేష్ బాబు "మహర్షి" బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో మంచి జోష్ మీదున్నాడు. అదే ఊపుతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సరిలేరు నీకెవ్వరు" లో నటిస్తున్నాడు. మహేష్ సరసన మొదటిసారి రష్మీక మందన్నా నటిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ మొదటిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనుంది. ఇలా సినిమాపై అంచనాలను పెంచే ఎన్నో హైలైట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్. రెమ్యునరేషన్ రూపంలో కాకుండా సినిమాకు ఒక నిర్మాతగా ఉండటంతో డీజిటల్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో తీసుకున్నాడని సమాచారం. అలా చూస్తే ఇప్పటికే సన్ నెట్ వర్క్స్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను రూ.30కోట్లకు కొనుగోలు చేసింది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కు రూ.15కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మహేష్ రూ.40 నుంచి 50 కోట్లి వరకు ముట్టిందనే టాక్ వినిపిస్తుంది.