
మహేష్ బాబును కలిసి ఫోటో దిగాలంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాల్సిందిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో తోపులాట జరిగి కొంతమంది అభిమానులకు గాయాలయ్యాయి. మా హీరోను కలవడానికి వస్తే బౌన్సర్లు కుక్కలను తరిమినట్టు కొట్టారని అభిమానుల్లో ఒకరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మహేష్ ఫ్యాన్ మీట్ కు ఫ్రీగా వెళ్లడం జరగలేదు. రూ.500 నుంచి రూ.2000 వరకు పాసులను అందుబాటులో ఉంచారు. తమ ఫెవరేట్ హీరోను కలిసేందుకు డబ్బులు కూడా లెక్కచేయకుండా వేలల్లో పాసులను కొనుగోలు చేశారు. డబ్బులు పెట్టి పాస్ లు కొంటే మోసం చేయడమే కాకుండా తమని అవమానించారంటూ వాపోతున్నారు.