
'సరిలేరు నీకెవ్వరు' సూపర్ విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు మరే సినిమాకు సంతకం చేయలేదు. అతని తదుపరి సినిమా చుట్టూ అనేక పుకార్లు వస్తూనే ఉన్నాయి. మహేష్ 27వ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఇంకా కొంత సమయం ఉంది. కాబట్టి, మహేష్ ఈ ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో గడపాలని అనుకుంటున్నాడు. మహేష్ ఫ్యామిలీ మ్యాన్ అని, తన ఖాళీ సమయాన్ని వారితో గడుపుతాడని మనందరికీ తెలుసు. సరిలేరు నీకెవ్వరు విడుదలైన తరువాత, తన కుటుంబంతో కలిసి, మహేష్ హాలిడే తీసుకొని కొంతకాలం యుఎస్ మరియు దుబాయ్‌లలో గడిపాడు. ఇప్పుడు, మహేష్ మరొక హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ తన కుటుంబంతో కలిసి హిమాలయాలకు వెళుతున్నాడని పుకార్లు వచ్చాయి. కాని తాజా వార్త ఏమిటంటే, అతను లండన్ ట్రిప్ కు ప్రణాళికలు వేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ కొన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్ షూటింగ్స్ ను ముగించాల్సి ఉంది. అవి ముగించి ట్రిప్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకపక్క ఈ కరోనా వైరస్ భయపెడుతుంటే, మహేష్ రిస్క్ తీసుకుంటాడా లేదా హాలిడేను వాయిదా వేస్తాడా అనేది చూడాలి.