
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం సంక్రాంతికి విడుదలై బొమ్మ దద్దరిల్లింది. మహేష్ తదుపరి చిత్రం డైరెక్టర్ పరుశురాంతో రానుంది. ఈ సినిమాకు 'సర్కారు వారి పాట' అనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను సైతం తాజాగా రిలీజ్ చేసారు. అంచనాలను మరింత పెంచేవిదంగా ఉంది ఫస్ట్ లుక్ పోస్టర్. ఈ బొమ్మ కూడా దద్దరిల్లుతుందనే నమ్మకంతో ఉన్నారు యూనిట్ మరియు అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇందులో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని వార్త జోరుగా ప్రసారమవుతుంది. ఒక పాత్రలో స్టూడెంట్ గా, మరో పాత్రలో తన్న అన్నను బ్యాంక్ స్క్యామ్ లో ఇరికించినందుకు రివెంజ్ తీసుకునే తమ్ముడిగా కనిపించనున్నట్లు పుకార్లు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.