
మహేష్ బాబు , రష్మీక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న రిలీజ్ అయింది. మహేష్ అన్నట్లుగా సరిలేరు నీకెవ్వరు 'బొమ్మ దద్దరిలిపోయింది'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.85 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇది మహేష్ కెరియర్ లొనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. దీన్నిబట్టి చూస్తుంటే సినిమా కమేర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత సక్సెస్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఎం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకుంది. అయితే మహేష్ ఇప్పటికే డైరెక్టర్ వంశీ పైడిపల్లితో తదుపరి సినిమా ఉడబోతుందని తెలిపాడు. అంతేకాకుండా అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా ఉంటుందని కంఫర్మ్ చేశాడు. అయితే అందుతున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లితో సినిమా అవ్వగానే అనిల్ రావిపూడితో చేయనున్నట్లు తెలుస్తోంది.