
కరోనా దెబ్బ మనుషులలో మానవతా విలువలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.అలాంటి ఘటనలో రోజుకొకటి మనకు దర్శనమిస్తాయి.దీనికి ప్రధాన కారణం భయం.అయితే తాజాగా.. జిహాద్ అల్ అనే పాలస్తీనియన్ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనికి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చింది. తన తల్లికి వయసు ఎక్కువ. ఆమెకి ఏమైనా అయితే.. అన్న ఆలోచన ఆ కుర్రాడిని.. కూల్ గా ఉండనివ్వలేదు. తనకి కూడా పాజిటివ్ వచ్చినా పర్వాలేదు. తన తల్లికి దగ్గరగా ఉండి సేవలు చేసుకుంటా అని డాక్టర్స్ ను వేడుకున్నాడు. అయితే.., హాస్పిటల్ వారు అందుకు అనుమతించలేదు. దీనితో ఆ కుర్రాడు మరో ఆలోచన చేశాడు. ప్రతిరోజూ హాస్పిటల్ ఎతైన గోడను ఎక్కి అద్దం నుండి తన తల్లిని చూసుకునేవాడు. ఇలా ఆమె ఐదు రోజులు ట్రీట్మెంట్ తర్వాత తుది శ్వాస ను విడిచింది. తల్లి కోసం తన కుమారుడు పడ్డ కష్టాన్ని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్స్ అతడు తల్లి కోసం చేసిన సాహసాన్ని కొనియాడుతున్నారు.మరికొందరు అతనికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.