
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు గత కొన్ని రోజుల నుండి మునుపెన్నడూ లేని విధంగా ఉత్సాహంగా ఉన్నారు. దానికి కారణం, అఖినేని ఫ్యామిలీ సూపర్ హిట్ చిత్రం 'మనం' మాదిరిగానే మహేష్ బాబు కుటుంబం మల్టీస్టారర్లో నటించడానికి కలిసి వస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. వివరాల్లోకి వెళితే, ఇటీవల కెరీర్లోనే భారీ హిట్ సాధించింది మహేష్ బాబు 'సరీలేరు నీకెవ్వరు'. అదే జోష్ లో తన తదుపరి చిత్రానికి వంశీ పైడిపల్లితో కలిసి పని చేయబోతున్నాడని ప్రకటించాడు. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం 'మహర్షి' మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది, ఏప్రిల్ నెలలో లాంచ్ కానుంది. అయితే, ఈ సినిమాలో గౌతమ్, కృష్ణ నటిస్తున్నారని పుకార్లు రావటంతో అదే నిజమని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఘట్టమనేని కుటుంబ సభ్యులెవ్వరు నటించడం లేదట. కాబట్టి ఘట్టమనేని మనం పై ఆశలు వదులుకోవాల్సిందే.