‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్’ నుండి మనసును హత్తుకునే ‘మనసా మనసా సాంగ్’
4 years ago 1 min read

అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్". ఇది చురుకైన వేగంతో షూటింగ్ జరుపుకుంటూ పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ రోజు అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుండి మేకర్స్ మొదటి సింగిల్ "మనసా మనసాను" తమ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటను సిడ్ శ్రీరామ్ ఆలపించారు. సురేంద్ర కృష్ణ అధునాతనమైన లిరిక్స్ రాశారు. మనసా మనసా పాటతో సిడ్ శ్రీరామ్ మరోసారి మ్యాజిక్ చేశారు. అందమైన లిరిక్స్ తో, ఆకట్టుకునే మ్యూజిక్ తో మనసా మనసా పాట హిట్ అవ్వటం ఖాయం. అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. G2A బ్యానర్ పై బన్నీ వాసు మరియు వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.