
బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నప్పటికి, అది ఆత్మహత్య కాదు హత్య అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరువాత తండ్రి కేకే సింగ్ సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రబర్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎఫైర్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నటి మంచు లక్ష్మి రియా చక్రవర్తిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఇటీవల రియా, రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ మొత్తం చూశాక దీనిపై స్పందించాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించి ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ తన భావాలను అందరి ముందుంచింది మంచు లక్ష్మి. ''సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలేంటో తనకు తెలియదు. అయితే వాటిని తెలుసుకోవాలనుకుంటున్నా. సుశాంత్‌కు న్యాయం చేయాలని సీబీఐ సహా అన్ని రకాల ఏజెన్సీలు, అధికారులు కష్టపడుతున్న తీరు హర్షనీయం. కాకపోతే నిజానిజాలు బయటకురాకుండానే ఒకరిని నిందించడం, వేరొకరి ఫ్యామిలీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదనేది నా అభిప్రాయం. మీడియా కథనాలు చూసి రియా కుటుంబం పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే సహచరులు అండగా నిలబడాలి. రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు. అసలు విషయం బయటకొచ్చే దాకా ఆమెను నిందించడం ఆపండి'' అని మంచు లక్ష్మి పేర్కొంది. ఇది చూసిన కొంతమంది సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.