
టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి తన సినిమాలతో కన్నా తన మాటలతో ఎంత ఫెమసో మనందరికీ తెలిసిన విషయమే. అది పక్కన పెడితే లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అలా తాజాగా మంచు లక్ష్మి చెప్పిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అంటే చాలా ఇష్టమని, పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాని వెల్లడించింది. అంతేకాదు అతనికి పెళ్లైన రెండు సార్లు కుమిలి కుమిలి ఏడ్చానని పేర్కొంది. మంచు లక్ష్మి తన మనసులోని మాటను బయట పెట్టారు సరే కానీ ఇలా మాట్లాడితే ఆమె డిసిప్లిన్ డాడీ ఎం అనరా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.