
సౌత్ ఇండస్ట్రీలో సుమారు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన నటి కాజల్ అగర్వాల్ ముంబైకు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యుల నడుమ పెళ్లి చేసుకొని ఇప్పుడు హనీమూన్ కోసం మాల్ధీవులకు వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడ భర్తతో తాను ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుందో ఫోటోల రూపంలో బయటపెడుతోంది. అయితే ఇదిలా ఉంటే రానా దగ్గుబాటి యూట్యూబ్ ఛానెల్ 'సౌత్ బే' లో ఒక షోలో పాల్గొన్న మంచు లక్ష్మి కాజల్ అగర్వాల్ గురించి అడిగినప్పుడు తను నాకు మంచి స్నేహితురాలు. పెళ్లి గురించి కూడా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. కానీ కరోనా విజృంభణ దృష్ట్యా ఎవరిని పిలవలేదని చెప్పిందని లక్ష్మి అన్నారు. అలాగే, పరిస్థితులు చిక్కబడ్డాక కచ్చితంగా పార్టీ ఇవ్వాలని పార్టీ ఇవ్వకుండా తప్పించుకుంటూ చిప్ గా బిహేవ్ చెయ్యొద్దని కాజల్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మరి కాజల్ అందరికి పార్టీ ఇవ్వాలంటే వచ్చే ఏడాదిలోనే కుదురుతుంది.