
'ఢీ- కొట్టిచూడు' సినిమా ఎవరు మర్చిపోరు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డులను సృష్టించింది. మంచు విష్ణు జెనిలీయా జంటగా నటించిన ఈ చిత్రం విష్ణు కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్. శ్రీను వైట్ల ప్రతిభ ఏంటో తెలియాలంటే ఎవరికైనా ఈ సినిమా చూపిస్తే చాలు. అయితే మళ్ళీ 13 ఏళ్ల తర్వాత ఢీ సీక్వెల్ రాబోతుంది. పుకారు కాదు నిజమే! ఈ ప్రకటన రాగానే ఎంతోమంది ఎగ్జైట్ అయ్యారు. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'డి & డి' అనే టైటిల్ తో సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి 'డబుల్ డోస్' అనేది ట్యాగ్ లైన్ గా నిర్ణయించారు. విష్ణు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు టైటిల్ లోగోతో ఈ ప్రకటన చేశారు.