
కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. మహామహులు సైతం దీని భారిన పడక తప్పట్లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎటునుంచి వస్తుందో తెలీదు. ఇంట్లో ఉండటమే వైరస్ నుంచి తప్పించుకునే మార్గం. ఇదిలా ఉంటే, కరోనా రావటంతో సినిమా షూటింగ్లు, రిలీజ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇది ఎప్పుడు తగ్గుతే అప్పుడు షూటింగ్లు ప్రారంభించేందుకు డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు. అలా, ఎదురుచూస్తున్న వారిలో మణిరత్నం కూడా ఉన్నారు. మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష వంటి తారాగణం ఉన్న ఈ చిత్ర షూటింగ్ ను సెప్టెంబర్ లో ప్రారంభించాలని మణిరత్నం ప్లాన్ చేసుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబర్ లో ఎలాగైనా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.