
ప్రముఖ నటుడు వేణు గోపాల్ హైదరాబాద్ గచిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. అతను కరోనావైరస్ సంక్రమించి మూడు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుది శ్వస విడిచారు. స్వల్ప జలుబు, జ్వరంతో మొదలై చివరకు అస్వస్థతకు దారి తీసింది. అంతే కాకుండ వేణు గోపాల్ కు గుండెకు సంబంధించిన వ్యాధి కూడా ఉన్నట్లు సమాచారం. కొసూరి వేణు గోపాల్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‌కు చెందినవారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మర్యాద రామన్న'తో వేణు గోపాల్ కు మంచి గుర్తింపు దక్కింది. ఛలో, పిల్ల జమీందార్, విక్రమార్కుడు వంటి హిట్ చిత్రాల్లో వేణు గోపాల్ నటించారు.
Tags: #Cinecolorz #Tollywood #VenuGopal