‘భీష్మా’ నుండి మాస్ బిట్ సాంగ్ ప్రోమో ఔట్: అదిరిపోయే నితిన్ స్టెప్పులు
4 years ago 1 min read

యువ నటుడు నితిన్ మరియు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కలిసి రొమాంటిక్ డ్రామ 'భీష్మా'°లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ రోజు భీష్మా నుండి రెండవ పాట 'వాట్టే బ్యూటీ'ని విడుదల చేశారు. నితిన్ మరియు రష్మిక మందన్న మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్ చేయబడింది. ఇది అద్భుతమైన బీట్లతో సాగే మాస్ పాట. నితిన్, రష్మిక చేసిన అద్భుతమైన స్టెప్పులు సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్మిక మందన్న అల్ట్రా గ్లామరస్ గా, నితిన్ స్టయిలిష్ గా కనిపిస్తాడు. రంగురంగుల సెట్లతో, ఎంతో కలర్ ఫుల్ గా నిర్మించిన ఈ సాంగ్ వీడియో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. వాట్టే బ్యూటీ పాటను ధనుంజయ్, అమలా చెబోలు పాడగా, కసర్ల శ్యామ్ లిరిక్స్ అందిచారు. మొత్తనికో ప్రోమో చాలా ఫుట్-ట్యాపింగ్ గా ఉండటమే కాక మొత్తం సాంగ్ ప్రోమో కోసం ఎదురుచూసేలా చేస్తుంది.