
సంక్రాంతి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, పండగకు వచ్చి కచ్చితంగా హిట్ కొడతాడు అన్న ధీమా హీరోల్లో, ప్రేక్షకుల్లో, నిర్మాతల్లో నెలకుంది. అందుకే అనిల్ తో సినిమా తీసేందుకు పెద్ద హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి దగ్గుబాటి వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ తెరకెక్కించిన "F2" బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఎఫ్2 సక్సెస్ మీట్ లోనే దీనికి సీక్వెల్ ఎఫ్3 రెడీగా ఉందని అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. అయితే ఆమధ్య అనిల్ రావిపూడి "F3" కథను వెంకటేష్ కు వినిపించగా వెంకీకి నచ్చడం ఓకే చెప్పడం జరిగింది. అయితే F3 లో వెంకటేష్, వరుణ్ లతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కానీ రవితేజ నటిస్తుంది లేంది చిత్ర బృందం కొన్ని రోజుల్లో అధికార ప్రకటన చేయనుంది. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది.