
మెగా కూతురు నిహారిక కొణిదెల వివాహం త్వరలో చైతన్య జొన్నలగ్గడతో జరగబోతున్న విషయం తెలిసిందే. నిహారిక సోషల్ మీడియాలో ఇప్పటికే ఇద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలను ఉంచడం జరిగింది. నాగబాబు కూడా ఈ ఏడాది చివరి కల్లా పెళ్లి జరుగుతుందని చెప్పారు. అయితే తాజాగా రెండు కుటుంబాలు కలిసి నిశితార్థంకు డేట్ ఫిక్స్ చేసారు. ఆగస్టు 13న కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితుల నడుమ వీరి నిశితార్థం జరగనుంది. ఇక చైతన్య ఒక సాఫ్త్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటెజిస్ట్ గా పని చేస్తున్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన చైతన్య తాజాగా ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ లో MBA పూర్తి చేసాడు. అయితే నాగబాబు ముందుగానే ఈ పెళ్లి అంగరంగ వైభవంగా ఎం జరగదని సింపుల్ గానే చేస్తామని చెప్పడం జరిగింది. మరి పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో, ఎక్కడ చేస్తారో చూడాలి.