
సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్సుల్లో ఒకటైన ఏఎంబి సినిమాస్ లో మెగా, అల్లు కుటుంబ సభ్యులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూతురైన సుష్మిత భర్త పుట్టినరోజు సందర్భంగా ఏఎంబి సినిమాస్ లో సినిమా చూసారు. అక్కడ దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ గ్రూప్ ఫోటోలో అల్లు అర్జున్, అల్లు శిరీష్, అర్జున్ బ్రదర్ అల్లు బాబీ, నిహారిక, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ కనిపించారు. ఇకపోతే ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు రామ్ చరణ్ జంట మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా, ఉపాసన ఈవెంట్ హాజరయ్యేందుకు విదేశాల్లో ఉందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ నటించిన అల...వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో నటిస్తున్నాడు.