
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది. 4 నెలలు ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయారు. కొద్దీ రోజుల క్రితమే జిమ్‌లు, మాల్స్ తెర్చుకోవడంతో ప్రజలు మాస్క్‌లు పెట్టుకొని రోజువారి పనులకు అలవాటు పడిపోయారు. అయితే హీరోలు కూడా జిమ్‌లకు వెళ్లడం మొదలుపెట్టారు. అల...తాజాగా రామ్ చరణ్ జిమ్ కు సుమారు కొన్ని నెలల తర్వాత రావడంతో భార్య ఉపసనా కొనిదేలా దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉపసనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల్లో చరణ్ జిమ్‌కు తిరిగి వెళ్లిన ఫోటోను పంచుకున్నారు. రామ్ చరణ్ ముసుగు మరియు అతని వర్క్ ఔట్ దుస్తులను ధరించినట్లు ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఫోటోను పంచుకుంటూ, "మిస్టర్ సి తిరిగి జిమ్‌లోకి వచ్చాడు. మీరు మొదలుపెట్టారా?" అని రాసింది.