
కరోనా లాక్ డౌన్ బ్యాచిలర్స్ కళ్ళు తెరిపించి పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది. వీళ్ళు ఇప్పట్లో పెళ్లి చేసుకోరులే అని అనుకున్నవారంత టపిటపిమని పెళ్లి చేసేసుకొని షాక్ ఇస్తున్నారు. మాకు గెస్ట్లు పెద్దగా రాకపోయినా పర్లేదు కానీ మేము ఆగేది లేదంటూ ఇప్పటికే ఓ ఇంటివారైన వాళ్లలో రానా దగ్గుబాటి, హీరో నితిన్, నిఖిల్ ఉన్నారు. వీళ్లే కాక మెగా డాటర్ నిహారిక కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగితో నిశ్చితార్థం చేసుకుంది. ఇలా వరుసపెట్టి తీపి కబుర్లు వింటున్న నెటిజన్లు ఇప్పుడు మరో పెళ్లి చూసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 'సోలో బతుకే సో బెటరూ' అంటూ సినిమా చేస్తున్నాడు హీరో సాయి ధరమ్ తేజ్. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో హ్యాపీగా పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మ చూసి, మెచ్చి, కుదిర్చిన బంధువుల ఇంటి అమ్మాయినే సాయి ధరమ్ తేజ్ చేసుకోబోతున్నాడని సమాధానం. ఈ సంబంధం గురించి మెగాస్టార్ తో చెప్పగా చిరు కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. అయితే పెళ్లి కుడా నవంబర్ లోనే చేద్దామనుకున్నప్పటికి ముహుర్తాలు కుదరకపోవడంతో వచ్చే ఏడాది సమ్మర్ లో పెళ్లి ఫిక్స్ చేసినట్లు టాక్.