
కమర్షియల్ గా సక్సెస్ తో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది పండించిన కామెడీ, వెంకీ మామ టైమింగ్, వరుణ్ తేజ్ నటన అన్ని కలిపి బొమ్మ దద్దరిల్లింది. అందుకే నిర్మాత దిల్ రాజు దీనికి సిక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యి మొన్నీమధ్యే సినిమాను ప్రారంభించడం ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయటం జరిగాయి. అయితే ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరిన్లు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ సిక్వెల్ డబ్బు నేపథ్యంలో సాగుతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతుంది. అంతే కాదు ఈ కధ కొంత కన్ఫ్యూజన్ తో కూడుకున్నదని అందులో నుంచి వచ్చే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రవితేజ నటిస్తున్నారని ఆ మధ్య పుకార్లు జోరుగా వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారట. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర కథకు ఎంతో ముఖ్యమట. అందుకే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. మరి దానికి సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.