
టాలీవుడ్ లో సినీ ప్రముఖల ఫ్యామిలీ గురించి ప్రస్తావన వస్తే అందరికి మొదటగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. పేరుకు తగ్గట్టే ఫ్యామిలీ నిజంగానే మెగా. ప్రస్తుతం హీరోలుగా చెలామణి అవుతున్న వారిలో ఎంతమంది మెగా కాంపౌండ్ నుంచి వచ్చారో చేసుకుంటేనే అర్ధం అవుతుంది ఫ్యామిలీ ఎంత పెద్దదో. అయితే, కరోనా లాక్డౌన్ సమయంలో సినీ తారల త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం ట్రెండ్ అయిపోయింది. తాజాగా మెగా హీరోల చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో రామ్ చరణ్. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ మరియు నిహారిక ఉన్నారు. బుల్లి మెగాహీరోలు ఉన్న ఫోటోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వందల షేర్లు, వేల లైకులతో వైరల్ అవుతుంది.