
తమ అభిమాన హీరోలు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తూ అభిమానుల ఆనందానికి అవధులు ఉంటాయా? ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆ ఆనందంలోనే ఉన్నారు. సోషల్ మీడియాలో గతకొంతకాలంగా త్రో బ్యాక్, త్రో బ్యాక్ థర్స్డే అనే హ్యాష్ ట్యాగ్లు బాగా కనిపిస్తున్నాయి. ఈ ఆనవాయితీని సెలెబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. త్రో బ్యాక్ అనే క్యాప్షన్ తో స్పెషల్ ఫోటో ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అలా, కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య పద్మశ్రీ అవార్డు తీసుకొని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అల్లు అర్జున్ తో రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లిన ఫోటోను పోస్ట్ చేసాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో పాటు రామ్ చరణ్ అక్క సుస్మిత, సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫోటోను మేజర్ త్రో బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే ఇక అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అల...వైకుంఠపురములో సినిమాతో, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో, సాయి ధరమ్ తేజ్ ప్రతీరోజు పండగేతో బిజీగా ఉన్నారు.