
మంచు మనోజ్ రీఎంట్రీ చిత్రం "అహం బ్రహ్మాస్మి" ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల ఆవిష్కరించినప్పటి నుండి మంచి ఆసక్తిని రేపింది. ఈ రోజు, హైదరాబాద్ లో ఫిలిం యూనిట్ మరియు ప్రముఖల మధ్య చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. మంచు మనోజ్ కు మంచి స్నేహితుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చరణ్ క్లాప్ కొట్టగా, విద్యా నిర్వాణ ముహూర్తం షాట్ కు దర్శకత్వం వహించింది. మంచు లక్ష్మి, సుష్మితా కొనిదేలా కెమెరా ఆన్ చేశారు. మోహన్ బాబు మరియు పరుచురి గోపాల కృష్ణ ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. అహం బ్రహ్మాస్మి మార్చి 11 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రియ భవానీ శంకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ రీఎంట్రీ సినిమా అవ్వటంతో కొంత హైప్ నెలకుంది. మరి మనోజ్ కు ఈ చిత్రం మంచి కమ్ బ్యాక్ చిత్రంగా నిలవాలని కోరుకుందాం.