
దర్శక దిగజం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న 'ఆర్ఆర్ఆర్' పైనే ఇప్పుడు అందరి దృష్టి. ఈ సినిమాపై అందరి ఫోకస్ ఉండటానికి కారణం...బాహుబలి లాంటి మహత్కర సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడం ఒకటైతే ఇందులో తెలుగు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించడం మరొకటి. అందుకే జక్కన్న ఇంకా జాగ్రత్తగా చెక్కుతున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్, సూపర్ స్టార్ కూడా ఉండబోతున్నారు. కానీ నటించరండోయి కేవలం మన హీరోలను కధలో పరిచయం చేస్తూ వాయిస్ ఇస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ లో రజినీకాంత్, హిందీలో ఆమిర్ కాన్ వాయిస్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికి ఇది ఇంకా పుకారు మాత్రమే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.