
మెగా కాంపౌండ్ గత రెండు నెలలుగా నిహారిక పెళ్లి సందడి కనిపిస్తూనే ఉంది. ఇదొక ఈవెంట్ తో మెగా ఇల్లు సందడిగా మారుతుంది. ఇక ఇప్పుడు అసలైన సమయం రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో పెళ్లి ఉన్న నేపధ్యంలో పెళ్లికి ముందు జరగాల్సిన ముచ్చట్లు ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల నడుమ జరుగుతున్నాయి. నిహారిక పెళ్లి కూతురి ఫంక్షన్ నుంచి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల నాటి అమ్మ నిశ్చితార్ధం చీర కట్టుకొని నిహారిక మెరిసిపోతుండగా ఆ ఈవెంట్ లో నిహారిక చిరంజీవి సెల్ఫీ దిగుతున్న ఫోటోను నాగబాబు షేర్ చేసారు. తన నవ్వుతో ఒక సందర్భాన్ని వేడుకగా మారుస్తాడు అంటూ చిరంజీవిని ట్యాగ్ చేసి ఈ ఫోటో షేర్ చేయటంతో అభిమానులు సంతోషంలో తేలుతున్నారు. మెగా బ్రదర్స్ ఇలా ఆప్యాయంగా ఉంటే ఆ కిక్కే వేరప్పా అని కామెంట్లు చేస్తున్నారు.