
ఇండస్ట్రీలోకి చిన్న సినిమాతో వచ్చి రెండో సినిమానే 300 కోట్ల భారీ బడ్జెట్ తో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'సాహో' ను డైరెక్ట్ చేసాడు సుజీత్. రెండో సినిమానే ఇంత భారీగా చేయగలిగిన సుజీత్ ను చూసి మెగాస్టార్ ఇంప్రెస్స్ అయ్యారని తెలిసింది. ప్రస్తుతం చిరు ఫుల్ ఫోకస్ 'ఆచార్య' పైనే పెట్టారు. ఈ సినిమా తర్వాత 'లూసిఫెర్' రీమేక్ చేయాలనీ అనుకున్న చిరు సుజీత్ కు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సుజీత్ ఇప్పటివరకు డెవలప్ చేసిన స్క్రిప్ట్ తో చిరు నిరాశపడ్డారని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని అనుభవం ఉన్న దర్శకుడు వివి వినాయక్ చేతిలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సింది.