
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక తెరకెక్కిన 151వ చిత్రంను "సైరా నరసింహారెడ్డి" భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ ఆశించిన రీతిలో ఫలితం దక్కలేదు. కేవలం తెలుగులో మాత్రమే సూపర్ హిట్ గా నిలిచి మిగితా భాషల్లో ప్లాప్ గా నిలిచింది. అయితే సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా బాలీవుడ్ నటులను, మ్యూజిక్ డైరెక్టర్ ను కాస్ట్ చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ సైరా రిజల్ట్ చూసిన చిరంజీవి కొరటాల శివతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం వద్దని తేల్చి చెప్పారట. ఇకపై రిస్క్ తీసుకోవడం వద్దని డిసైడ్ అయిన చిరు మూవీ రిలీజ్ అయ్యాక రిజల్ట్ బట్టి డబ్ చేయొచ్చని చెప్పారట. దీంతో చిరు స్వయంగా చెప్పడంతో కొరటాల శివ తన నిర్ణయాన్ని మార్చుకున్నారట.