
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని ప్రకటించారు. ఆచార్య చిత్ర షూటింగ్ మార్చి మొదటి వారంలో మొదలై, దాదాపు రెండు వారాల పాటు చిత్రీకరించిన అనంతరం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రిత్య షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సుమారు 5 నెలల తర్వాత ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా దృష్ట్యా షూటింగ్ ను మొదలుపెట్టలేదు. అయితే, చిరు పుట్టినరోజు సందర్భంగా కోరటాల శివ టీజర్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఒక చిన్న డైలాగ్ టీజర్ సిద్ధంగా ఉంది కాని మెగాస్టార్ చిరంజీవి అందుకు నో అంటే నో అన్నారట. ఇప్పటికి కేవలం ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విడుదల చేయమని చెప్పారట. ఆచార్య టీజర్‌ను చిరంజీవి తరువాత తేదీలో విడుదల చేయాలనుకుంటున్నారట. కాబట్టి ఆచార్య యొక్క డైలాగ్స్ టీజర్ విడుదల ప్రణాళికలు నిలిపివేయబడ్డాయి.