
టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరంగా రాజకీయాల్లో బిజీగా గడిపారు. చాలా గ్యాప్ తర్వాత "ఖైదీ నెంబర్ 150" తో రీఎంట్రీ ఇచ్చి బాక్స్‌లు బద్ధలయ్యేలా చేశారు. బాస్ కు రీఎంట్రీ సినిమా 150వ సినిమా కావడం సినిమాకు మరింత మైలేజ్ ను ఇచ్చింది. ఈ చిత్రం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించడంతో చిరు వేతనం గురించి ఇక్కడ వార్తలు పొక్కలేదు. ఆ తరువాత వచ్చిన 151వ చిత్రం మాగ్నమ్ ఓపస్ "సైరా నరసింహ రెడ్డి" తో చిరు పాన్ ఇండియా లెవెల్ లో అడుగుపెట్టారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అయిన గీత ఆర్ట్స్ నిర్మాణంలో వస్తుంది..ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుస్తుందంటే...ఇది కూడా హోమ్ బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లోనే తెరకెక్కింది. ఇక ఇప్పుడు క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఆచార్య" సినిమాను రామ్ చరణ్ సమర్పిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. దీంతో చిరు రెమ్యునరేషన్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకి గాను చిరు 50కోట్లు పే చెక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే, ఇప్పటి హీరోలైన ప్రభాస్, మహేష్ కు సమానంగా అన్నమాట. మరి బాస్ ఆ మజాకా!