
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహామహులను సైతం ఇంటికే అంకితం చేసింది. పోలీస్, డాక్టర్లు నిర్విరామంగా శ్రమిస్తూ ప్రజలను కాపాడేందుకు పోరాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు కడుపుకట్టుకొని ఉంటాము? అనే ప్రశ్నతో కొత్త విధానాన్నికి అలవాటు పడుతూ ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో ఎంతోమంది కరోనా భారిన పడుతున్నారు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలానో అలా కరోనా భారిన పడుతున్నారు. కొంతకాలం క్రితం రాజమౌళి, హీరో రాజశేఖర్, తమన్నా, కీరవాణి వంటి తారలు కరోనా మహమ్మారి బాధితులై కోలుకుని యాంటీ బాడీలు కూడా ఇచ్చారు. అయితే యాంటీ బాడీలు ఇవ్వడం ఎంత అవసరమో అందరికి తెలిసే ప్రయత్నం చేస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైతం తాజాగా కరోనాకు పాజిటివ్ గా పరీక్షించబడ్డారు. కానీ చిరంజీవి గారికి ఎటువంటి లక్షణాలు లేవని, సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. చిరంజీవి కూడా త్వరలో కరోనా నుంచి బయటపడాలని కోరుకుందాం.