
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివాతో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కోసం జాతకట్టారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. అయితే చిరంజీవితో ఒక ప్రత్యేకమైన పాటలో కాలు కదిలించడానికి కోరటాల శివ డస్కీ బ్యూటి రెజీనా కాసాండ్రాను సంప్రదిస్తున్నట్లు తెలిసిన విషయమే. ఇది గ్రామానికి చెందిన జానపద పాట అని, ఈ పాటను మేకర్స్ ఇటీవల చిత్రీకరించారని వర్గాలు చెబుతున్నాయి. రెజీనా కాసాండ్రా యొక్క గ్లామర్ మరియు ఆమె వేసే స్టెప్పులు ఈ ఐటెమ్ నంబర్ కు హైలైట్ కానున్నాయి. డాన్స్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి, అలాంటి హీరో రెజీనా కాసాండ్రా నటన, డాన్స్ చూసి షాక్కు గురైనట్లు వినికిడి. గతంలో, రెజీనా కాసాండ్రా అల్లు సిరిష్, సాయి ధరం తేజ్ వంటి మెగా హీరోలతో కలిసి పనిచేసింది. కాని ఇప్పుడు మాస్ అవతారంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. రెజీనాకు చిరు మంచి బ్రేక్ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తుంది.