
అక్కినేని సమంత ప్రయత్నించని రంగం లేదు. 2020 లో కరోనా అని అందరూ భయపడుతూ ఉన్న సమయంలో సామ్ మాత్రం లాక్డౌన్ తియ్యటంతోనే వరుస షోట్టింగ్ లతో బిజీగా ఉంది. మొన్నీమధ్యే 'ఆహా' ఓటిటి ప్లాట్ఫామ్ లో సమంత హోస్ట్ గా సెలబ్రిటీ టాక్ షో మొదలై అప్పుడే సీజన్ పూర్తవుతుంది కూడా. అయితే మాములు చాట్ షోల కాకుండా పేద ప్రజలకు సహాయం చేస్తూ తెలియని రియల్ హీరోలను పరిచయం చేస్తూ సెలెబ్రిటీలతో ఆటపాటలతో తాను తప్ప మరెవరు చేయలేరు అన్నట్లుగా దూసుకుపోతుంది. అయితే మెగాస్టార్ చిరజీవితో కూడా ఒక ఎపిసోడ్ చేసిన సమంత చిరుని ఒక ప్రశ్న అడిగింది. ఇందులో చిరంజీవిని ఆట పట్టించాలని సమంత ప్రయత్నించగా, చిరు సైతం దీటుగానే సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. "మీ ఇంట్లోని ఫ్రిజ్ లో ఎప్పుడైనా ఉండే ఐటమ్ ఏంటి?" అని సమంత ప్రశ్నించగా, "సమంతా... మీరు అనుకునేది మాత్రం కాదు" అంటూ మెగాస్టార్ చురకలేశారు. క్రిస్మస్ కానుకగా ఇది ఆహాలో ప్రసారం కానుంది.