
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల పెళ్లి నిన్న ఉదయ్ పూర్ లో మెగా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాదేమో అనుకున్న పవన్ కళ్యాణ్ ఏకంగా కొడుకు, కూతురితో వచ్చి వేడుకను మరింత మధుర జ్ఞాపకంగా మార్చారు. సోషల్ మీడియా పుణ్యమా అని నిహారిక పెళ్లి అందరికి దగ్గరుండి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిమిషానికో ఫోటో రావటంతో మనం కూడా పెళ్లిలో భాగమైనట్లు అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా కూతురి పెళ్లి సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి స్పెషల్ నేక్లెస్ కొనుగోలు చేశారట. దాన్ని సురేఖ దగ్గరుండి డిజైన్ చేయించ్చినట్లు తెలుస్తుంది. ఆ నేక్లెస్ బంగారం మరియు వజ్రాలతో చేయబడినదని అత్యంత ఖరీదు ఉంటుందని అది చూసిన వారు అనుకుంటున్నట్లు సమాచారం.