
మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన్ను పూజించే వాళ్ల్లు కోట్లలో ఉన్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెం. 150 తో రి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' కు చిరంజీవి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ సుంకర నిర్మించబోతున్న వేదాళం రీమేక్ కు రూ. 60 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంత డిమాండ్ చేసిన కూడా నిర్మాతలు ఎక్కడ తగ్గట్లేదట. ఎందుకు తగ్గుతారు మరి? బాస్ సినిమా వస్తే మినిమమ్ వసూళ్లు గ్యారెంటీ, ఇక సినిమా బాగుంటే కోట్ల వర్షం ఖాయం.
Tags: #Chiranjeevi #Cinecolorz #Megastar