
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండుగ. అలాంటి ఓ భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని మే 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ మెగా ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. మే నెల చిరంజీవి సినిమాలకు బాగా కలిసివచ్చిందంటూ.. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలాగే ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా మే నెలలో ఉంది. ఆ తర్వాత 1993 లో రిలీజైన మెకానిక్ అల్లుడు సినిమా కూడా మే నెలలోనే విడుదలైంది. ఈ సినిమా తర్వాత దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆచార్య ను మే నెలలోనే రిలీజ్ చేయడం విశేషమనేది ప్రేక్షకుల అభిప్రాయం.