
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా నిజంగానే దద్దరిల్లింది. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయటమే కాకా టివిలో కూడా టిఆర్పిలో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా మహేష్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను కుదిరినంత వేగంగా పూర్తి చేసి వంశీ పైడిపల్లితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యారట. అయితే వంశీతో చేయబోయే సినిమాకు మెగాస్టార్ చ్రినజీవి సూపర్ హిట్ చిత్రం 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ ను పెట్టాలని చూస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మెగాస్టార్ టైటిల్ కు సూపర్ స్టార్ బొమ్మ నిజంగానే దద్దరిల్లితుంది.