
చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న #చిరు 152 లో విలన్ పాత్రకై కలెక్షన్ కింగ్ మోహన్ బాబును సంప్రదించాలని ఆలోచిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, చిరంజీవికు విలన్ గా మారతాడనమాట. కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు, భారత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, కోరటాల శివ చిత్రంలో చిరంజీవి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కోసం మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. కొరటాల శివతో మణిశర్మ జతకట్టడం ఇదే మొదటిసారి. 'సైరత్' ఫేమ్ అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి, కాని తరువాత మేకర్స్ మణి శర్మను ఖాయం చేశారు. చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించనుంది. స్పెషల్ సాంగ్ కోసం బృందం రెజీనాను ఎంపిక చేసుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.