
అర్ధం కాలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అంశం ఇదే. గ్రాండ్ ఫినాలే వీక్ లో ఇంటి సభ్యులందరు ఇద్దరిద్దరిగా వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లను కలిసిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో మెహబూబ్ వచ్చి అక్కడున్న గ్లాస్ మీద చేయి పెట్టి సోహెల్ కు మూడు అని చూపించాడు. దీంతో సోహెల్ కు తాను మూడో స్థానంలో ఉన్నాని అర్థమైంది. అందుకే నాగార్జున 20 లక్షలు అఫర్ చేసినప్పుడు అలోచించి 25 లక్షలు అనగానే తీసుకొని బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత హింట్ ఇచ్చినందుకు మెహబూబ్ కి ఫ్రెండ్షిప్ పేరుతో 5 లక్షలు, అనాధ పిల్లలకు 5 లక్షలు ఇస్తాను అనే సరికి నాగ్ అవసరం లేదు ఆ 10 లక్షలు నేనే ఇస్తానని తర్వాత మెగాస్టార్ వచ్చి మెహబూబ్ సోహెల్ నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఇలా సోహెల్ తన ఖాతాలో 45 లక్షలు వేసుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హిస్టరీలో నిలిచిపోయారు.