
మెహ్రీన్ కౌర్ పిర్జాదా మరియు అశ్వద్దామ నిర్మాత శంకర్ ప్రసాద్ మధ్య అంతా సరిగ్గా లేనటుంది. మెహ్రీన్ కౌర్ పిర్జాదా చివరిసారిగా శంకర్ ప్రసాద్ కొడుకు నాగశౌర్య నటించిన థ్రిల్లర్ డ్రామా 'అశ్వద్దామా'లో కనిపించిందని తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె అనేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. అశ్వద్దామ చిత్రం విడుదలకు ఒక రోజు ముందు, మేకర్స్ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో ఒక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మెహ్రిన్ ను రమ్మని మేకర్స్ అడగగా...స్కిన్ ఎలర్జీ కారణంగా తాను రాలేనని చెప్పింది. అయితే, ఈ కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోతే ఆమె హోటల్ బిల్లులు చెల్లించబోమని అశ్వద్దామ నిర్మాతలు తెలిపారు. మరుసటి రోజు ఉదయం, మెహ్రీన్ పిర్జాదా హోటల్ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా హోటల్ నుండి బయలుదేరింది. తర్వాత హోటల్ బిల్లులను క్లియర్ చేయమని మెహ్రీన్ పిర్జాదా మేనేజర్ అశ్వద్దామ నిర్మాత శంకర్ ప్రసాద్‌ను పదేపదే కోరినట్లు, చివరికి అతను బిల్లు చెల్లించాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నాగశౌర్య తండ్రి యొక్క ప్రవర్తనతో మెహ్రీన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.